భారతదేశం, డిసెంబర్ 16 -- ఆ రోజు వచ్చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 మినీ వేలం మంగళవారం, డిసెంబర్ 16న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని అబుదాబిలో జరగనుంది. ఈ వేలంలో 359 మంది ఆటగాళ్ల భవిష్యత్తు తేలనుంది. ఆటగాళ్ల వేలంలో పాల్గొనడానికి మొత్తం 1390 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే, ఫ్రాంచైజీల నుండి స్పందనల అనంతరం 359 మంది ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్ చేసింది బీసీసీఐ.

ఐపీఎల్ 2026 మినీ వేలం అన్ని స్ట్రీమింగ్, టెలికాస్ట్ వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఈ వేలం మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అబుదాబిలో జరుగుతుంది. మినీ వేలం స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం అవుతుంది. ఈ మినీ వేలం జియోహాట్‌స్టార్‌ యాప్, వెబ్‌సైట్‌లో లైవ్‌గా స్ట్రీమ్ కానుంది. జియోహాట్‌స్టార్‌ ఓటీటీలో దీన్ని చూడొచ్చు.

ఆస్ట్రే...