భారతదేశం, జూలై 25 -- హరి హర వీరమల్లు బాక్సాఫీస్ కలెక్షన్స్ డే 1: క్రిష్, జ్యోతికృష్ణ డైరెక్షన్ కాంబినేషన్ లో పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు గురువారం (జులై 24)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతకంటే ముందు బుధవారం సాయంత్రం ప్రీమియర్ షోలు వేశారు. అయిదేళ్లుగా నిర్మాణంలో ఉన్న మూవీ ఎట్టకేలకు థియేటర్లకు వచ్చేసింది. పవన్ కల్యాణ్ సినిమా అంటే బాక్సాఫీస్ దగ్గర సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

హిస్టారికల్ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన హరి హర వీరమల్లు తొలి రోజు ఇండియాలో రూ.44.20 కోట్ల నెట్ కలెక్షన్లు వసూలు చేసిందని సక్నిల్క్ వెబ్ సైట్ తెలిపింది. హరి హర వీరమల్లు బాక్సాఫీస్ కలెక్షన్ ట్రేడ్ వెబ్ సైట్ ప్రకారం ఇండియాలో ప్రీమియర్ ద్వారా రూ.12.7 కోట్లు, తొలి రోజు రూ.31.5 కోట్లు రాబట్టింది. ఇటీవల విడుదలైన సినిమాలతో పోలిస్తే పవన్ కు ...