భారతదేశం, నవంబర్ 24 -- రంగారెడ్డి జిల్లా కోకాపేటలో భూముల ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి కోకాపేట భూమి రికార్డు సృష్టించింది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన భూముల ఈ వేలంలో ప్లాట్లు ఊహించని ధరలు పలికాయి. ప్రభుత్వం నిర్వహించిన ఈ వేలంలో ఎకరం రూ.137 కోట్లు పలికింది.

నియోపొలీస్ లేఅవుట్‌లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) నిర్వహించిన వేలంలో ఎకరం భూమికి రికార్డు స్థాయిలో రూ.137.25 కోట్ల ధర పలికింది. మెుత్తం 9.90 ఎకరాల ప్లాట్‌ను రూ.1355.33 కోట్లకు కొనుగోలు చేశారు.

అధికారులు ఈ లేఅవుట్‌ను అంతర్జాతీయ సౌకర్యాలతో అభివృద్ధి చేశారు. వేలంలో చూసుకుంటే మెుదటి రౌండ్‌లో రెండు ప్లాట్లు అమ్ముడుపోయాయి. ప్లాట్ నెంబర్ 17లో 4.59 ఎకరాలకు గానూ ఎకరానికి రూ.136.50 కోట్లకు, ప్లాట్ నెంబర్ 18లో ఎకరానికి రూ.137.25 కోట్ల చొప్పున...