భారతదేశం, ఆగస్టు 29 -- ఆధునిక జీవనశైలి, ఆరోగ్య స్పృహ పెరగడంతో చాలామంది ఆహారంలో మార్పులు చేసుకుంటున్నారు. 'ఆరోగ్యకరమైనవి' అనుకుని కొన్ని పదార్థాలను తీసుకుంటున్నారు. కానీ, గుండెను కొలెస్ట్రాల్‌ కంటే ఎక్కువగా నిశ్శబ్దంగా దెబ్బతీసే ఒక పదార్థం ఉందని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ దిమిత్రి యారనోవ్ హెచ్చరిస్తున్నారు. అది ఏమిటో తెలుసుకుందామా..

గుండె జబ్బులకు కేవలం కొలెస్ట్రాల్ మాత్రమే కారణం కాదు. సోషల్ మీడియాలో ఆయన రాసిన ఒక పోస్ట్‌లో.. "మీ గుండెను నిశ్శబ్దంగా దెబ్బతీసేది (అది కొలెస్ట్రాల్ కాదు!)" అంటూ డాక్టర్ యారనోవ్ ఒక విషయాన్ని వెల్లడించారు. మనం ప్రతిరోజు తెలియకుండానే తీసుకునే పానీయాలు, స్నాక్స్, సాస్‌లు, ఇంకా 'ఆరోగ్యకరమైనవి' అని భావించే ఆహారాలలో కనిపించే ఒక సాధారణ పదార్థం 'చక్కెర' అని ఆయన చెప్పారు. చక్కెర గుండె ఆరోగ్యానికి హాని కలిగించడమే కాక...