Hyderabad, ఆగస్టు 29 -- టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుల్లో ఎస్వీ కృష్ణారెడ్డి ఒకరు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహిస్తున్న సినిమా వేదవ్యాస్. ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు నిర్మాతగా పొలిటిషియన్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వ్యవహరించారు.

రీసెంట్‌గా ఆగస్ట్ 28న అన్నపూర్ణ స్టూడియోలో వేదవ్యాస్ సినిమాను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో అనిల్ రావిపూడి, దిల్ రాజు, వీవీ వినాయక్, అలీ, మురళీ మోహన్, నిర్మాత కె అచ్చిరెడ్డి, హీరోయిన్ జున్ హ్యూన్ జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మా కె అచ్చిరెడ్డి ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.

నిర్మాత కె అచ్చిరెడ్డి మాట్లాడుతూ.. "ఈ రోజు మేము పిలవగానే మా మీద అభిమానంతో మా వేదవ్యాస్ సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన దిల్ రాజు గారు, వినాయక్ గారు, అనిల్ రావిపూడి గారు, జెమినీ కిరణ్ గారు, ఇతర అతిథులు అందరికీ కృతజ...