Hyderabad, జూలై 19 -- గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ సమయంలో శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడతాయి. ఇక ఇది ఇలా ఉంటే, సోమవారం ఆగస్టు 4న చాలా స్పెషల్. ఎందుకంటే, ఆ రోజు అరుదైన యోగాలు ఏర్పడతాయి. దీంతో నిద్రపోతున్న అదృష్టం కూడా మేల్కొంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గజలక్ష్మి రాజయోగం శుభ ఫలితాలను తీసుకొస్తుంది. ఈ యోగం, గురువు-శుక్రుడు మిథున రాశిలో సంయోగం చెంది ఏర్పరుస్తున్నాయి. ఇది డబ్బు, అందం మొదలైన వాటిని తీసుకువస్తుంది.

దీనితో పాటుగా ద్విద్వాదశ యోగం కూడా ఏర్పడుతుంది. సూర్యుడు-గురువు కలిసి ఈ యోగాన్ని ఏర్పరుస్తున్నాయి. అంతేకాకుండా, సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. సూర్యుడు బుధుడుతో సంయోగం చెంది బుధాదిత్య యోగాన్ని ఏర్పరుస్తాడు.

దీంతో తెలివితేటలు పెరుగుతాయి, నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువ అవుతాయి. మొత్తం ఇవన్న...