భారతదేశం, జనవరి 28 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అన్ని రాశుల వారిపై ప్రభావం చూపుతుంది. ఫిబ్రవరి నెలలో చూసుకున్నట్లయితే నాలుగు ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు రాబోతోంది. దీంతో ఐదు రాజయోగాలు ఏర్పడతాయి. ఇది 12 రాశుల వారిపై ప్రభావం చూపించినా, కొన్ని రాశుల వారు మాత్రం ఎక్కువ లాభాలను పొందుతారు.

ఫిబ్రవరి నెలలో ఈ రాజయోగాల కారణంగా కొన్ని రాశుల వారికి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆర్థికపరంగా బాగుంటుంది. సక్సెస్‌ను అందుకుంటారు. వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. అభివృద్ధిని చూస్తారు.

ఫిబ్రవరి 3న బుధుడు కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఫిబ్రవరి 6న శుక్రుడు రాశి మార్పు చేస్తాడు. ఫిబ్రవరి 23న కుజుడు కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ ప్రధాన గ్రహాల సంచార మార్పుల కారణంగా చతుర్...