భారతదేశం, జనవరి 26 -- గ్రహాలు కాలనుగుణంగా వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు తీసుకొస్తుంది. త్వరలోనే లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడబోతోంది. ఇది బుధ, శుక్ర గ్రహాల కలయికతో ఏర్పడబోతోంది. ఈ రాజయోగం శని రాశి అయినటువంటి కుంభరాశిలో ఏర్పడింది. ఫిబ్రవరి 3న గ్రహాల రాజైన బుధుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఫిబ్రవరి 6న శుక్రుడు కూడా కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది.

ఈ యోగం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకొస్తుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు, ఆర్థికపరంగా లాభాలు, వ్యాపారంలో కలిసి రావడం, ఆనందం, వాహనాలు ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక లాభాలు కలుగుతాయి. మరి ఆ అదృష్ట రాశులు ఎవరనేది ఇప్పుడు చూద్దాం.

మేష రాశి వారికి లక్ష్మీనారాయణ యోగం బాగా కలిసి వస్తుంది. ఇది వా...