Hyderabad, సెప్టెంబర్ 15 -- ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండాలని అనుకుంటారు. కానీ కొంతమంది ఇంటి నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు ఎందుకు లక్ష్మీదేవి కొందరి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది? దానికి కారణాలేంటి అనే దాని గురించి తెలుసుకుందాం.

ప్రతి ఒక్కరూ కూడా ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఇల్లు శుభ్రంగా లేకపోతే లక్ష్మీదేవి ఆ ఇంట ఉండడానికి ఇష్టపడదు. ఉతకని బట్టలు, అనవసరమైన కాగితాలు, పనికిరాని సామాన్లు ఇలా వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి. లేకపోతే వీటి కారణంగా ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

పైగా లక్ష్మీదేవి కూడా అలాంటి ఇంటిని ఇష్టపడదు. ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. దీంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి, చెత్తను తొలగించాలి.

ఎవరి వ...