భారతదేశం, నవంబర్ 6 -- రాష్ట్రంలోని పత్తి రైతులు ఎదుర్కొంటున్న కష్టాలపై రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కేంద్రానికి లేఖ రాశారు. కేంద్ర చేనెత, జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ దృష్టికి పలు సమస్యలను తీసుకెళ్లారు. 2025-26 ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 4.56 లక్షల హెక్టార్లలో పత్తి సాగు జరగగా.. సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా ఉందని పేర్కొన్నారు. మొంథా తుఫాన్ ప్రభావంతో పత్తి పంట తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు కనీస మద్దతు ధర (MSP) కంటే తక్కువ ధరలకు పత్తిని విక్రయించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సీఎం యాప్ (CM APP) మరియు ఆధార్ ఆధారిత ఈ-పంట వ్యవస్థ ద్వారా పత్తి కొనుగోళ్లు పూర్తిగా డిజిటలైజ్ చేయబడిన విధానంలో నిర్వహిస్తున్నదని లేఖలో వివరించారు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాపాస్ కిసాన్ యాప్ (Kapa...