భారతదేశం, డిసెంబర్ 18 -- తెలంగాణలో చలి తీవ్రత కొనసాగుతోంది. కొన్నిచోట్ల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరికొన్నిచోట్ల ఉదయం, రాత్రి సమయంలో మంచు కురుస్తోంది. ఉదయం సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రాబోయే రెండు రోజులు తెలంగాణలోని పలుచోట్ల శీతల గాలులు వీచే అవకాశం ఉంది. అక్కడకక్కడ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో శీతల గాలులు వీచే ఛాన్స్ ఉండగా... ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

రేపు ఆదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ శీతల గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ ...