భారతదేశం, జనవరి 7 -- రైతుల్లో నమ్మకం, భరోసా కల్గించేలా కొత్త పాస్ పుస్తకాలను అందచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తప్పులు లేకుండా రికార్డులను సరి చేసి కొత్త పాస్ పుస్తకాల పంపిణీ జరగాలని ఆదేశించారు. ఈ నెల 2వ తేదీ నుంచి మొదలైన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీపై మంగళవారం సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా రెవెన్యూ మంత్రి, ఆ శాఖ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు.

సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ..."ప్రభుత్వం పంపిణీ చేస్తున్న కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలతో రైతుల్లో నమ్మకం, భరోసా కలగాలి. భూ రికార్డుల్లో గతంలో జరిగిన తప్పులను సరిదిద్దాలి. కొత్త పాస్ పుస్తకాలను ముద్రించే ముందుగానే గ్రామసభల్లో ఆయా రైతుల నుంచి భూ వివరాలు నిర్ధారించుకోవాలి. ఆ తర్వాతే కొత్త పాస్ పుస్తకాలను ముద్రించాలి. రికార్డులను తారు ...