భారతదేశం, నవంబర్ 12 -- టాలీవుడ్‌లో రీరిలీజ్‌ల హవా నడుస్తున్న కాలం ఇది. ప్రతి స్టార్ హీరో పాత సినిమాలను ఏదో ఒక సందర్భంలో రీరిలీజ్ చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ మూవీ కొదమసింహం కూడా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. చిరుని కౌబాయ్ పాత్రలో చూపించిన ఈ మూవీ రీరిలీజ్ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు.

మెగాస్టార్ చిరంజీవి 1990లో నటించిన సూపర్ హిట్ మూవీ కొదమసింహం. కే మురళీమోహన్ రావు డైరెక్ట్ చేశాడు. పరచూరి బ్రదర్స్ స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమాను ఇప్పుడు 35 ఏళ్ల తర్వాత నవంబర్ 21న రీరిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో చిరంజీవితోపాటు సోనమ్, మోహన్ బాబు, రాధ, కన్నడ ప్రభాకర్ లాంటి వాళ్లు నటించారు. మూవీ రీరిలీజ్ ట్రైలర్ 4కే క్వాలిటీలో రిలీజై అభిమానులకు కనులవిందు చేసింది.

చిరు కౌబాయ్ పాత్ర, నిధి వేట ఈ మూవీని ప్రత్యేకంగా నిలిపాయి. ...