భారతదేశం, అక్టోబర్ 19 -- కాంతార చాప్టర్ 1 మూవీ కలెక్షన్ల మోత మోగిస్తూనే ఉంది. బాక్సాఫీస్ ను షేక్ చేస్తూనే ఉంది. థియేటర్లలో ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన కాంతార చాప్టర్ 1 జోరు మాత్రం తగ్గడం లేదు. 17వ రోజు ఈ మూవీ వసూళ్లు 47 శాతం పెరగడం విశేషం. శనివారం (అక్టోబర్ 19) ఈ చిత్రం మళ్లీ పుంజుకుంది. డ్యూడ్, తెలుసు కదా, కే ర్యాంప్, బైసన్ లాంటి కొత్త సినిమాలు వచ్చినా కాంతార చాప్టర్ 1 అదరగొడుతూనే ఉంది.

అక్టోబర్ 15న గణనీయమైన తగ్గుదల తర్వాత రిషబ్ శెట్టి యాక్షన్ థ్రిల్లర్ కాంతార చాప్టర్ 1 శనివారం నాడు తిరిగి పుంజుకుంది. 2025లో రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచిన ఈ సినిమా, మూడవ వారంలో కూడా జోరు తగ్గించకుండా బ్లాక్‌బస్టర్ దీపావళి వారాంతానికి సిద్ధమవుతోంది. గత మూడు రోజులుగా వరుసగా వసూళ్లలో తగ్గుదల చూ...