భారతదేశం, డిసెంబర్ 24 -- కొడంగల్ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌ల ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొత్త సర్పంచులను అభినందించి, శాలువాలతో సత్కరించారు. గ్రామాభివృద్ధికి సర్పంచుల పాత్ర కీలకమని సీఎం పేర్కొన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి గారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచ్‌లకు నేరుగా నిధులు అందిస్తామని ప్రకటించారు. 'పెద్ద గ్రామాలకు రూ.10 లక్షలు, చిన్న గ్రామాలకు రూ.5లక్షల చొప్పున ఇస్తాం. సర్పంచ్‌లకు స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద అందిస్తాం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధం లేకుండా నిధులు ఇస్తాం. గ్రామాల్లో అర్హులందరికీ రేషన్ కార్డులు జా...