భారతదేశం, నవంబర్ 9 -- గ్రహణాలను అశుభంగా భావిస్తారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి. ఏడాదికి రెండు లేదా మూడు గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రతి ఏడాది రెండు పూర్తి గ్రహణ కాలాలు ఏర్పడడం చూస్తూ ఉంటాం. 2026 ఫిబ్రవరి 17న పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనపడుతుందా లేదా, సూతక కాలం వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఫిబ్రవరి 17న ఏర్పడే ఈ పాక్షిక సూర్యగ్రహణం భారతదేశంలో కనపడదు. చిలీ, అర్జెంటీనా, అంటార్కిటికా, మారిషస్, గ్రీన్‌ల్యాండ్, ఐర్లాండ్, దక్షిణ జార్జియా, జింబాబ్వేతో పాటు పలుచోట్ల ఈ గ్రహణం కనబడుతుంది. ఈ పాక్షిక సూర్యగ్రహణం భారతదేశంలో కనపడదని తెలుస్తోంది. సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏర్పడిన రెండు వారాలు లేదా దాని కంటే ముందు ఏర్పడుతుంది.

సూర్యగ్రహణం చంద్రుడు, భూమి అమావాస్య సమయంలో ఒకే సరళరేఖలో ఉన్నట్లయితే ...