Telangana, అక్టోబర్ 4 -- రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,620 మద్యం దుకాణాల టెండర్లకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జిల్లాల వారీగా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇందుకు అక్టోబర్ 18వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. అయితే దరఖాస్తు ఫారమ్ కు సంబంధించి ఎక్సైజ్ శాఖ మరో అప్డేట్ ఇచ్చింది.

కొత్త వైన్స్ టెండర్ల కోసం దరఖాస్తు ఫారమ్ లను కేవలం ఆఫ్ లైన్ లోనే కాకుండా ఆన్ లైన్ లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మేరకు అధికారులు ప్రకటన చేశారు. సబ్మిషన్ మాత్రం ఆఫ్ లైన్ లోనే చేయాలి. కాకపోతే దరఖాస్తు ఫారంను ఆన్‌లైన్‌ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటిని పూర్తి చేసిన తర్వాత. ఆయా ఎక్సైజ్‌ జిల్లాల కార్యాలయాల్లో సమర్పించుకోవచ్చు. అక్టోబర్ 18వ తేదీలోపే ఈ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.

రాష్ట్రంలోని 34 ఎక్సైజ్‌ జిల్లాలకు సంబంధించిన గెజిట్‌ నోటిఫికేష...