Telangana, సెప్టెంబర్ 17 -- రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థల్లో కీలక మార్పులు రానున్నాయి. ప్రస్తుతం ఉన్న రెండు డిస్కమ్ లు మాత్రమే కాకుండా. మరో కొత్త డిస్కమ్ ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదే విషయంపై గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో. కొత్త డిస్కమ్ ఏర్పాటుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. తాజాగా అధికారులు పలు ప్రతిపాదనలను సిద్ధం చేయగా.. సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఇందనశాఖపై సమీక్షించారు. మూడవ డిస్కం ఏర్పాటుకు వీలైనంత తొందరగా పూర్తిస్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. సంబంధిత పీపీఏ అలొకేషన్, సిబ్బంది, ఆస్తుల విభజన, బకాయిలు, ఇతర అంశాలపై సూచనలు చేశారు. మంత్రిమండలి ఆమోదం తర్వాత మూడో డిస్కంపై ముందుకు వెళ్లాలని చెప్పారు.

రాష్ట్రంలో సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్, నార్త...