భారతదేశం, మే 12 -- ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అలాగే మొత్తం రేషన్ కార్డులకు సంబంధించి 7 సర్వీసుల్లో మార్పుచేర్పులు చేస్తున్నారు. కొత్త రేషన్ కార్డు, రేషన్ కార్డుల్లో సభ్యుల జోడింపు, తొలగింపు, చిరునామా మార్పులు, ఆధార్ సీడింగ్... కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లు అప్లికేషన్ ప్రాసెస్ ఎక్కడి వరకూ వచ్చిందో ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు.

ఏపీలో మే 7 నుంచి 7 రకాల రేషన్ కార్డ్ సర్వీసులను తిరిగి ప్రారంభించారు. గ్రామ, వార్డు సచివాలయంలో రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న తర్వాత, రసీదును అక్కడే పొందవచ్చు. అలాగే దరఖాస్తుదారుడు మొబైల్ కు ఏపీ ప్రభుత్వం నుంచి మెసేజ్ వస్తుంది. ఇందులో అప్లికేషన్ నెంబర్(T123456789), ట్రాన్ జెక్షన్ నంబర్ ఉంటుంది. అప్లికేషన్ నెంబర్ ద్వారా రేషన్ కార్డు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.

గ్రామ, వార్డు సచివాలయ...