భారతదేశం, మే 20 -- ఆంధ్రప్రదేశ్ లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు, రేషన్ కార్డుల్లో మార్పుచేర్పులకు అవకాశం కల్పించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే దరఖాస్తుల్లో కొత్త చిక్కులు వస్తున్నాయి. ఇప్పటి వరకూ వచ్చిన దరఖాస్తుల్లో 80 శాతం బియ్యం కార్డుల్లో పేర్ల తొలగిపు లేదా జోడింపు వంటి సమస్యలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

రైస్ కార్డుల్లో పేర్ల తొలగింపు లేదా జోడింపునకు పత్రాల చిక్కొచ్చిపడింది. స్వయంగా మంత్రి, ఉన్నతాధికారులు మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరంలేదని చెబుతున్నా.. దరఖాస్తు సమయంలో మాత్రం అవి కావాల్సిందేనని సిబ్బంది అంటున్నారు. మరణించిన వారి పేర్లు మినహా ఇతరుల పేర్లు రైస్ కార్డుల నుంచి తొలగించే అవకాశం లేదని సిబ్బంది అంటున్నారు.

ఈ నెల 7న ప్రారంభమైన ప్రక్రియలో ఇప్పటి వరకూ 3,48,399 దరఖాస్తులు అంద...