Telangana,hyderabad, జూలై 3 -- తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు మంజూరవుతున్నాయి. ఆఫ్ లైన్, మీసేవా ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్న అధికారులు ఎప్పటికప్పుడు మంజూరు చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది రేషన్ కూడా తీసుకున్నారు.

రేషన్‌ కార్డుల మంజూరులో భాగంగా.. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 4.76 లక్షల దరఖాస్తులకు ఆమోదం తెలిపింది. వీటి ద్వారా మొత్తం 11.30 లక్షల మందికి ప్రయోజనం కలగనుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

కొత్త కార్డులతో పాటు పేర్లు జత చేయటం వంటి ప్రక్రియ సాగుతుండగా.. కొత్తగా ముద్రించిన కార్డుల పంపిణీ ఇంకా షురూ కాలేదు. అయితే ఈ ప్రక్రియను జూలై 14న ప్రారంభించాలని సర్కార్ ప్రాథమికంగా నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి తుంగతుర్తి సభలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిసింది. ఆ దిశగా ఏర్పాట్లు జరుగతున్నాయి.

రేషన్ కార్డుల పంపిణీ కార్యక...