Telangana,hyderabad, జూలై 4 -- తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధమవుతోంది. ఆ దిశగా సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 14వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

కొత్త రేషన్‌ కార్డుల మంజూరులో భాగంగా.. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 4.76 లక్షల దరఖాస్తులకు ఆమోదం తెలిపింది. వీటి ద్వారా మొత్తం 11.30 లక్షల మందికి ప్రయోజనం కలగనుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. వీరందరి పేర్లు కూడా పౌరసరఫరాల శాఖ వెబ్ సైట్ లో అందుబాటులోకి వచ్చాయి.

కొత్త రేషన్ కార్డులతో పాటు పాత కార్డులో జోడింపు అయిన కుటుంబ సభ్యుల వివరాలను తెలుసుకునేందుకు వీలుగా కూడా పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే పేర్లు వచ్చిన వాళ్లు. రేషన్ కూడా తీసుకుంటున్నారు. అయితే వీరికి ఫిజికల్ గా కార్డులను పంపిణీ చేయాల్సి ఉంది.

రేషన్ కార్డుల పంపిణీ...