భారతదేశం, మే 17 -- ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అర్హులైన వారి నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇప్పటికే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కొత్త రైస్ కార్డ్ కోసం దరఖాస్తు చేయటంతో పాటు మార్పుల, చేర్పులకు కూడా అవకాశం ఉంది. దీంతో చాలా మంది కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవటమే కాకుండా. పాత వాటిల్లోనూ మార్పుల కోసం అప్లికేషన్ పెట్టుకుంటున్నారు.

రేషన్ కార్డుల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లో అనర్హులకు కార్డులను మంజూరు చేయవద్దని నిర్ణయించింది. దీంతో స్వీకరిస్తున్న దరఖాస్తులను మూడు దశల్లో వెరిఫై చేయనుంది.

రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా.. ఈకేవైసీ, వీఆర్వో, తహసీల్దార్ ఇలా మూడు చోట్ల పరిశీలించాల్సి ఉంటుంది. ఈ 3 దశల పూర్తికి 21 రోజుల సమయం పడుతు...