భారతదేశం, మే 9 -- ఏపీలో పౌరసరఫరాల వ్యవస్థను పునర్‌వ్యవస్థీకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రజలకు సంతృప్తి కరమైన సేవల్ని అందించాలని సూచించారు. మే 15 నుంచి వాట్సప్ గవర్నన్స్ ద్వారా రేషన్ దరఖాస్తుల స్వీకరణ చేపట్టాలని సీఎం అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

రేషన్ సరుకుల పంపిణీ, దీపం-2 పథకం అమలు, ధాన్యం సేకరణలో ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా.... అవకతవకలు జరగకుండా మొత్తం వ్యవస్థను పునర్‌వ్యవస్థీకరించాలని పౌరసరఫరాల శాఖ అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించారు. ప్రజల్లో పూర్తి సంతృప్తి చెందేలా సేవలు అందించాల్సి ఉందన్నారు. ఎక్కడా రేషన్ బియ్యం రీ సైక్లింగ్ జరగకుండా చూడాలన్నారు.

రైస్ కార్డులో పేర్లు నమోదైనప్పటికీ, జీఎస్‌డబ్ల్యుఎస్ డేటాలో లేని 79,173 మంది వివరాలపై వెంటనే పరిశీలన చేసి సరిచేయాలన్నారు. కొత్త రైస్ ...