భారతదేశం, మే 26 -- హైదరాబాద్ నగరంలో రేషన్‌ కార్డులకు మోక్షం కలగనుంది. మీ సేవ కేంద్రాల్లో ఆన్‌లైన్‌ ద్వారా వచ్చిన అప్లికేషన్లపై క్షేత్ర స్థాయి విచారణ చేస్తున్నారు అధికారులు. అర్హులకు కొత్త కార్డులు మంజూరు చేస్తున్నారు. సివిల్ సప్లై డిపార్ట్‌మెంట్ ఇప్పటికే విచారణ పూర్తి చేసి.. కొందరికి కార్డులు మంజూరు చేసింది. ఇంకా కొందరికి తిరస్కరించింది. పెండింగ్ దరఖాస్తులపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

ఈ నెల 24వ తేదీ వరకు మంజూరైన కొత్త కార్డులకు రేషన్‌ కోటాను అధికారులు కేటాయించారు. దశలవారీగా విచారణ చేస్తూ.. రేషన్‌ కార్డులు మంజూరు చేస్తున్నట్లు పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు. గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లాల నుంచి ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. సుమారు 2 లక్షల కుటుంబాల వరకు కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు.....