భారతదేశం, నవంబర్ 23 -- సినిమాలతో అలరించే హీరో, హీరోయిన్లు ఏదో ఒక బిజినెస్ రంగంలోకి అడుగుపెడుతుంటారు. ఇది సినీ ఇండస్ట్రీలో చాలా సాధారణంగా జరిగే విషయమని తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వ్యాపారాలు చూసుకుంటున్నారు.

అలా తెలుగులో సినిమాలతోపాటు రెస్టారెంట్స్‌ను నిర్వహిస్తున్న యంగ్ హీరో ధర్మ మహేష్. సింధూరం సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ధర్మ మహేష్ ఇటీవల డ్రింకర్ సాయి మూవీతో అలరించాడు. సింధూరం సినిమాకు గామా బెస్ట్ డెబ్యూ అవార్డ్ కూడా అందుకున్నాడు ధర్మ మహేష్.

అయితే, ధర్మ మహేష్ తాజాగా కొత్త రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. నాన్‌వెజ్ ఇష్టపడే వారిలో మండి కూడా ఒక ఫేవరెట్ ఐటమ్‌. అలాంటి మండి ప్రియుల కోసం వైవిధ్యమైన రుచులను అందించేందుకే 'జిస్మత్' అధినేత, హీరో ధర్మ మహేష్ కొత్త రెస్టారెంట్‌ను ప్రార...