భారతదేశం, మే 9 -- వాటికన్ లోని కార్డినల్స్ గురువారం అమెరికాకు చెందిన రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రెవోస్ట్ ను కొత్త పోప్ గా ఎన్నుకున్నారు. పోప్ గా ఎన్నికైన అనంతరం అతడు 14వ లియో XIV (Leo XIV) అనే పేరును పొందాడు. లియో XIV చరిత్రలో మొదటి అమెరికన్ పోప్ గా నిలిచాడు.

కొత్త పోప్ ఎన్నిక ముగిసినట్లు గురువారం సింబాలిక్ గా చూపే తెల్లని పొగ సెయింట్ పీటర్స్ బాసిలికా సిస్టిన్ చాపెల్ చిమ్నీ నుంచి వచ్చింది. ఫ్రెంచ్ కార్డినల్ డొమినిక్ మాంబెర్టీ కొత్త పోప్ వివరాలను ప్రకటించారు. లాటిన్ పదాలతో "హాబెమస్ పాపం" (మాకు ఒక పోప్ ఉన్నారు) అని ఫ్రెంచ్ కార్డినల్ డొమినిక్ మాంబెర్టీ ప్రకటించారు. మొదటి లాటిన్ అమెరికన్ పోప్, 12 సంవత్సరాలు చర్చికి నాయకత్వం వహించిన పోప్ ఫ్రాన్సిస్ గత నెలలో మరణించిన తరువాత 267 వ కాథలిక్ పోప్ గా లియో 14 గురువారం ఎన్నికయ్యారు.

ఫ్రెంచ్, ఇటాలియన్ సంతత...