భారతదేశం, డిసెంబర్ 24 -- సినిమా ఇండస్ట్రీలోకి రావాలని, వెండితెరపై తమ కథను చెప్పాలని కోట్లాది మంది కలలు కంటుంటారు. కానీ, సరైన వేదిక దొరక్క ఎంతోమంది ప్రతిభావంతులు వెనకబడిపోతున్నారు. అలాంటి వారి కోసం 'బాహుబలి' ప్రభాస్ ఒక అద్భుతమైన మార్గాన్ని సుగమం చేశారు.

కథకులకు, యువ దర్శకులకు గ్లోబల్ ప్లాట్‌ఫామ్ కల్పించే ఉద్దేశంతో 'ది స్క్రిప్ట్ క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్'ను ప్రభాస్ తాజాగా ప్రారంభించారు. దీంతో కొత్త దర్శకులకు గుడ్ న్యూస్ అందడమే కాకుండా ఇది ఒక బంపర్ ఆఫర్ అని కూడా అనుకోవచ్చు.

షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభం సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక వీడియోలో ప్రభాస్ మాట్లాడుతూ.. "ది స్క్రిప్ట్ క్రాఫ్ట్ అనేది కేవలం ఒక ఫెస్టివల్ మాత్రమే కాదు. ఇది మీ కథలను కెరీర్‌లుగా మార్చే వేదిక. ప్రతి గొంతుకు ఒక ఆరంభం ఉండాలి. ప్రతి కలకూ ఒక అవకాశం దక...