భారతదేశం, నవంబర్ 5 -- ఏపీలో జిల్లాల పునర్విభజన సమస్యల పరిష్కారంపై ఏర్పాటైన మంత్రి వర్గ ఉప సంఘం సచివాలలో సమావేశమైంది. ఈ సమావేశంలో అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, అనిత, బీసీ జనార్దన్, నిమ్మల రామానాయుడు ఉన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, మండలాలు, గ్రామల సరిహద్దుల మార్పులపై మంత్రి వర్గ ఉపసంఘం సుదీర్ఘంగా చర్చించింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అధ్యయనం తుది దశకు చేరుకుంది.

త్వరలోనే జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ రిపోర్ట్ సీఎం చంద్రబాబుకు మంత్రి వర్గ ఉప సంఘం ఇవ్వనుంది. మదనపల్లి, మార్కాపురం కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలపై ఇప్పటికే ఆమోద ముద్ర వేశారు. అయితే వీటితోపాటుగా మరికొన్ని కొత్త జిల్లాల ఏర్పాటు మీద మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. 7,8 కొత్త జిల్లాలు కా...