భారతదేశం, ఫిబ్రవరి 8 -- జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం ఆశీర్వచనం అందించారు. దేవాలయ అతిథి గృహంతో పాటు ఇతర అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. దేవాలయ ప్రాంగణంలో మొక్కను నాటారు.

ఆ తర్వాత 'ప్రజా పాలన-ప్రగతి బాట' కార్యక్రమంలో భాగంగా జయశంకర్ జిల్లా చెల్పూరు గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ, సింగరేణి మెడికల్ బోర్డు అంశాలపై స్పష్టతనిచ్చారు.

కొన్ని జిల్లాలను రద్దు చేస్తారని, సింగరేణి మెడికల్ బోర్డును రద్దు చేస్తారంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష...