భారతదేశం, మే 11 -- హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. ఆగిఉన్న వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో.. ముగ్గురు మృతిచెందారు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి తర్వాత అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఈ ప్రమాదం మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. దీని గురించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్‌ బహదూర్‌పుర హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన రితేశ్‌ అగర్వాల్‌ కుమారుడు దీపేశ్‌ అగర్వాల్‌(23). రితేశ్ ఈమధ్యనే కొత్త కారు కొన్నారు. అతను కుమారుడు దీపేశ్.. శుక్రవారం రాత్రి 11 గంటలకు కారును తీసుకుని స్నేహితులను కలిసి వస్తానని చెప్పి వెళ్లాడు. ఆ తర్వాత కార్వాన్‌ విజయనగర్‌ కాలనీకి చెందిన సంచయ్‌ మల్పానీ(22), ప్రగతినగర్‌కు చెందిన ప్రియాన్ష్‌ మిత్తల్‌(23)ను కారులో ఎక్కించుకున్నాడు.

ఈ ముగ్గురూ కలిసి కారులో శంషాబాద్‌ ...