భారతదేశం, డిసెంబర్ 22 -- ఈ ఏడాది టీమిండియాకు మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. వన్డే, టీ20ల్లో (వైట్ బాల్) ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్, మహిళల వరల్డ్ కప్ గెలిచి అదరగొట్టినా.. టెస్టుల్లో (రెడ్ బాల్) మాత్రం దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడిపోయి నిరాశపరిచింది. ఇప్పుడు 2026లో టీమిండియా షెడ్యూల్ మరింత బిజీగా ఉంది.

ఇందులో పురుషుల టీ20 ప్రపంచకప్, మహిళల టీ20 ప్రపంచకప్, అండర్-19 ప్రపంచకప్ వంటి మెగా ఈవెంట్లు ఉన్నాయి. గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టెస్టుల్లో తడబడ్డా.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా సత్తా చాటింది. ఇక రాబోయే 2026 క్రికెట్ క్యాలెండర్ చాలా బిజీగా ఉండబోతోంది. పురుషుల, మహిళల క్రికెట్ జట్ల పూర్తి షెడ్యూల్ ఇక్కడ చూడండి.

ఈ ఏడాది భారత్ వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుండటం విశేషం.

జనవరి 15 - ఫిబ్రవరి 6 (అండర్ 19 వరల్డ్ కప్): నమీబియా, జింబాబ్...