భారతదేశం, మే 8 -- కొన్ని నెలలుగా నటి సమంత రూత్ ప్రభు, దర్శకుడు రాజ్ నిడిమోరు డేటింగ్ చేస్తున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇరువురూ ఈ వార్తను ధృవీకరించలేదు. అలాగే ఖండించలేదు కూడా. కానీ తరచుగా కలిసి కనిపిస్తున్నారు. ఇప్పుడిక సమంత తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఫొటోలు ఈ డేటింగ్ రూమర్స్ ను మరింత పెంచాయి. రిలేషన్ షిప్ ను సమంత కన్ఫామ్ చేసిందని ఫ్యాన్స్ అంటున్నారు.

ప్రొడ్యూసర్ గా సమంత తొలి అడుగు వేస్తున్నారు. ఆమె నిర్మించిన 'శుభం' మూవీ రేపే (మే 9) రిలీజ్ కాబోతోంది. ప్రోడ్యూసర్ గా సమంత ఇదే ఫస్ట్ ఫిల్మ్. ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న సమంత తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో వరుసగా ఫొటోలు పోస్టు చేసింది. ఇందులో రాజ్ నిడిమోరు ఫొటోలు కూడా ఉన్నాయి. సమంత, రాజ్ సెల్ఫీ కూడా ఉంది.

'శుభం' మూవీ రిలీజ్ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సమంత ఫొటోలు పోస్టు...