భారతదేశం, మే 3 -- క్వీన్స్ ల్యాండ్ కు చెందిన 38 ఏళ్ల మోనిక్ జెరెమియా అనే వ్యాపారవేత్త "హాట్ పరుపు (hot bedding)" అనే కొత్త ట్రెండ్ ద్వారా అదనపు డబ్బు సంపాదిస్తున్నారు. ఆమె తన మంచంలోని మిగతా సగ భాగాన్ని అపరిచితులకు అద్దెకు ఇస్తారు. నెలకు 985 ఆస్ట్రేలియా డాలర్లకు (ప్రస్తుత రేటు ప్రకారం సుమారు రూ.54,000) తన బెడ్ లోని సగ భాగాన్ని ఆమె అద్దెకు ఇస్తారు. అయితే, ఎలాంటి భావోద్వేగ బంధాలు లేకుండా ఒకరి పక్కన పడుకోవాలనేది ఆమె సృజనాత్మక ఆలోచన.

తన బెడ్ లో సగ భాగం రెంట్ కు తీసుకునే వ్యక్తికి ముందే కొన్ని షరతులు,నిబంధనలను వివరిస్తానని ఆమె తెలిపారు. ఇద్దరూ నిబంధనలను అర్థం చేసుకుంటే డబ్బు సంపాదించడానికి ఇది మంచి మార్గం అని జెరెమియా అభిప్రాయపడ్డారు. స్పేస్ ను గౌరవంగా, అంచనాలు లేకుండా పంచుకోగలిగిన వారికి ఈ హాట్ బెడ్ మంచి ఐడియా అవుతుందని ఆమె చెప్పారు. ఇది ఒక ప...