భారతదేశం, జూలై 30 -- ఐకానిక్​ కైనెటిక్ గ్రూప్​కి చెందిన ఎలక్ట్రిక్ వాహన విభాగం అయిన కైనెటిక్ వాట్స్ అండ్ వోల్ట్స్ లిమిటెడ్.. ఎట్టకేలకు కైనెటిక్ డీఎక్స్​ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారతదేశంలో విడుదల చేసింది. రూ. 1.12 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో మార్కెట్లోకి వచ్చిన ఈ ఈ-స్కూటర్, ఒకప్పుడు దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కైనెటిక్ హోండా డీఎక్స్​ జ్ఞాపకాలను మళ్లీ తీసుకువస్తుంది. డీఎక్స్​, డీఎక్స్​+ అనే రెండు వేరియంట్‌లలో లభించే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.17 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఐకానిక్ కైనెటిక్ డీఎక్స్​కి ఈవీ రూపంలో పునర్జన్మనిస్తూనే, ఒరిజినల్ మోడల్ నుంచి డిజైన్ స్ఫూర్తిని పొందింది. దీని డిజైన్ సిల్హౌట్ డీఎక్స్​ని పోలి ఉన్నప్పటికీ, ఆధునిక స్టైలింగ్ అంశాలను కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​లోని ప్రతి ప్యానెల...