భారతదేశం, మే 17 -- రాష్ట్రంలో కొత్తగా రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు.. ఆధార్‌తో పాటు వివాహ ధ్రువపత్రం జతచేసి సచివాలయాల్లో అందజేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది. పెళ్లికార్డు ఉంటేనే మ్యారేజీ రిజిస్ట్రేషన్‌ పత్రం ఇస్తారు. అలాగే దరఖాస్తుకు జత చేసేందుకు చాలామంది మళ్లీ శుభలేఖలను ప్రింటింగ్‌ చేయించుకుంటున్నారు.

వివాహ ధ్రువీకరణ పత్రం కోసం.. దరఖాస్తు ఫారానికి భార్యాభర్తల ఆధార్‌ కార్డు, వయసు నిర్ధారణ ధ్రువీకరణ పత్రం, శుభలేఖ, వివాహ సమయంలో తీసుకున్న ఫొటోలు, ముగ్గురు సాక్షులు, కల్యాణ మండపం రసీదు, ఆలయాల్లో జరిగితే.. వారు ఇచ్చే రిజిస్ట్రేషన్‌ పత్రం, రూ.500 చలానా జత చేసి సబ్‌రిజిస్ట్రార్‌కు దరఖాస్తు ఇవ్వాలి. వివరాలు అన్నీ కరెక్ట్‌గా ఉంటే.. గంట వ్యవధిలో వివాహ ధ్రువీకరణ పత్రం ఇస్తారు.

గ్రామాల్లో, పట్టణాల్లో వివాహం జరిగిన వెంటనే సచివాలయాల్లో ద...