భారతదేశం, జూన్ 25 -- తన కొడుకును కాపాడుకోవడానికి దొంగతనం చేసిన ఓ వ్యక్తి జైలు పాలయ్యాడు. కానీ జైల్లో ఉండగానే తన బిడ్డ చివరి శ్వాస విడిచాడు. ఈ ఘటన చైనాలో వెలుగు చూసింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం, 29 ఏళ్ల యూ హైబో అనే తండ్రి తన కొడుకుకు సోకిన ల్యుకేమియా చికిత్స కోసం రోడ్డు పక్కన ఉండే ట్రాన్స్‌ఫార్మర్‌లను దొంగిలించి జైలు పాలయ్యాడు. కానీ అతను జైలులో ఉండగానే అతని నాలుగేళ్ల కుమారుడు జియాయు ప్రాణాలు కోల్పోయాడు.

హైబో జైలులో ఉన్న ప్రాంతానికి అతి దగ్గరలోని ఒక సరస్సులో అతని కొడుకు జియాయు అస్థికలను నిమజ్జనం చేశారు.

జిలిన్ ప్రావిన్స్‌లోని ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టిన యూ హైబోది పేదరికం నిండిన బాల్యం. టీనేజ్‌లోనే బడి మానేసి, బతుకు తెరువు కోసం చెఫ్‌గా, వెల్డర్‌గా పనిచేశాడు. ఇరవై ఏళ్లు కూడా నిండకముందే తన ప్రేయసిని పెళ్లి చేసుకున్...