Hyderabad, మే 22 -- పెంపకం అనేది ఒక అందమైన, బాధ్యతాయుతమైన ప్రయాణం. ముఖ్యంగా కొడుకును పెంచే విషయంలో ఈ ప్రయాణం మరింత సున్నితంగా మారుతుంది. నిజానికి బాల్యంలో తల్లిదండ్రులుగా కొడుకుకు ఇచ్చిన ప్రేమ, మద్దతు, మార్గదర్శకత్వం అతడి ఉత్తమ మనిషిగా మారుస్తుంది.

కొడుకు ఆలోచనకు, ఆత్మవిశ్వాసానికి, సంబంధాలకు పునాది వేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. తల్లిదండ్రుల ప్రతి మాట, ప్రతి ప్రవర్తన, ప్రతి నిర్ణయం అతని వ్యక్తిత్వంపై నేరుగా ప్రభావాన్ని చూపుతాయి. తల్లిదండ్రులు పిల్లల మానసిక వికాసానికి హాని కలిగించే విధంగా ప్రవర్తించకూడదు.

తల్లిదండ్రలు తమకు తెలియక పెంపకం సమయంలో కొన్ని ప్రాథమిక తప్పులు చేస్తూ ఉంటారు. తాము చేస్తున్నది తప్పు అని కూడా వారికి తెలియదు. ఎలాంటి పనులు చేయడం వల్ల మీ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఏర్పడుతుందో తెలుసుకోండి. కాబట్టి కొడుకును పెంచేటప్పుడు ...