భారతదేశం, మే 20 -- రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని.. వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కలియుగంలో రాజకీయాలు చేయాలంటే భయం ఉండకూడదని.. కేసులకు, జైళ్లకూ భయపడకూడదని నాయకులకు దిశానిర్దేశం చేశారు. తెగువ, ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయగలమని.. అలా అయితేనే నాయకులుగా ఎదుగుతామని చెప్పారు.

'మన హయాంలో ఈ తరహా రాజకీయాలు చేయలేదు. తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి 18, మనకు 16 స్థానాలు వచ్చాయి. టీడీపీ వాళ్లని లాక్కుందామని మన ఎమ్మెల్యే అడిగాడు. కానీ మన పార్టీ ఎమ్మెల్యేను హౌస్ అరెస్ట్ చేయించాం. తాడిపత్రిలో ప్రజాస్వామ్యంగా ఎన్నిక జరిగేలా చూశాం. కాబట్టే తాడిపత్రిలో టీడీపీ గెలిచింది' అని జగన్ వివరించారు.

'సంఖ్యాబలం లేని తిరువూరులో కూడా పోటీకి దిగారు. వైఎస్సార్సీపీకి మెజార్టీ ఉండటంతోనే ఎన్నిక ఆపుతున్నారు. మన నేతలను అరెస్టు చేస్తున్నార...