భారతదేశం, మే 8 -- ారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్నాయి. పాకిస్థాన్ దాడి చేసేందుకు ప్రయత్నిస్తే భారత్ తిప్పికొట్టింది. ఆ తర్వాత దాడి చేసింది. పాకిస్థాన్‌లోని అనేక వైమానిక రక్షణ విభాగాలను ధ్వంసం చేసిన ఇజ్రాయెల్ డ్రోన్ హారోప్ గురించి చర్చ నడుస్తోంది. ఈ డ్రోన్ వల్ల పాకిస్థాన్‌లో జరిగిన విధ్వంసం ఆ దేశ సైన్యం స్వయంగా వివరించింది. ఈ సూసైడ్ డ్రోన్ లాహోర్‌తో సహా పాకిస్థాన్‌లోని వివిధ ప్రాంతాల్లో వారి వైమానిక రక్షణ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్ తయారు చేసిన హారోప్ డ్రోన్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..

హారోప్ అనేది ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (IAI) MBT క్షిపణుల విభాగం నిర్మించిన దాడి డ్రోన్. ఈ డ్రోన్ శత్రు భూభాగంపై తిరుగుతూ ఆదేశం అందిన వెంటనే దాడి చేయగలదు. ఈ డ్రోన్ స్వయంగా పనిచేయగలదు లేదా రిమోట్ ద్వారా కూడా ...