భారతదేశం, మే 25 -- ేరళలోని సముద్ర తీరానికి సమీపంలో లైబీరియాకు చెందిన పెద్ద నౌక సముద్రంలో పూర్తిగా మునిగింది. ఇక్కడ లైబీరియన్ కార్గో షిప్ అకస్మాత్తుగా తీరం నుండి 38 నాటికల్ మైళ్ల దూరంలో వంగిపోయింది. మెల్లమెల్లగా మెుత్తం మునిగిపోయింది. దీని కారణంగా ఓడలో లోడ్ చేసిన అనేక కంటైనర్లు సముద్రంలో పడిపోయాయి. ఇందులో వందల కంటైనర్లు ఉన్నాయి. వాటిలో 13 కంటైనర్లలో ప్రమాదకరమైన రసాయనాలు, 12 కంటైనర్లలో కాల్షియం కార్బైడ్, మిగిలిన వాటిలో 84.44 మెట్రిక్ టన్నుల డీజిల్, 367 మెట్రిక్ టన్నుల ఫర్నేస్ ఆయిల్ ఉన్నట్టుగా ఇండియన్ కోస్డ్ గార్డ్ తెలిపింది.
దీనితో పర్యావరణ నష్టం ప్రమాదం ఎక్కువే జరుగుతుంది. లీకైతే సముద్ర జలాలు తీవ్రంగా కలుషితమయ్యే అవకాశం ఉంది. దీంతో అధికారులు కొచ్చి తీరంలో హైఅలర్ట్ ప్రకటించారు. ఆయిల్ ఎంతమేరకు లీక్ అయిందనే దాని గురించి పరిశీలిస్తున్నారు. ఒక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.