Hyderabad, జూన్ 13 -- మలయాళ నటుడు ధ్యాన్ శ్రీనివాసన్ నటించిన మరో సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వస్తోంది. ఈమధ్యే 'డిటెక్టివ్ ఉజ్జ్వలన్'లో కనిపించిన ఈ నటుడి మలయాళ కామెడీ మూవీ 'ఆప్ కైసే హో' ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 27న థియేటర్లలో రిలీజైంది. సరిగ్గా నాలుగు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది.

ధ్యాన్ శ్రీనివాసన్ నటించిన మలయాళ మూవీ 'ఆప్ కైసే హో' ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు నాలుగు నెలల తర్వాత జూన్ 27 నుంచి ఈ సినిమా సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ ధ్యాన్ శ్రీనివాసన్ మూవీ థియేటర్లలో ఆశించిన మేర ప్రభావం చూపలేకపోయింది.

ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అని మేకర్స్ ఎదురు చూస్తున్నారు. హిందీ టైటిల్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసినా.. అది బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ కాలేదు.

ఆప్ కేసే హ...