భారతదేశం, సెప్టెంబర్ 3 -- ఏపీలోని ప్రతి జిల్లాలోనూ ఎరువులు అందుబాటులో ఉన్నాయని సీఎం చంద్రబాబు చెప్పారు. కొందరు కావాలనే ఉద్దేశంతోనే యూరియాను దారి మళ్లిస్తున్నట్టుగా చెప్పారు. ఎరువు లభ్యతపై సచివాలయంలో మీడియాతో మాట్లాడిన సీఎం.. కీలక వ్యాఖ్యలు చేశారు. యూరియాను దారి మళ్లించిన వారిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. రూ.3 కోట్ల విలువైన యూరియాను స్వాధీనం చేసుకున్నట్టుగా పేర్కొన్నారు. ఫేక్ పార్టీ, నేరాలను నమ్ముకుని దందాలు చేసే పార్టీ ఎరువుల మీద తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు.

రైతులకు సరైన సమయంలో యూరియా, ఎరువులను సరఫరా చేయడమే తమ లక్ష్యమని చెప్పారు సీఎం. యూరియాకు సంబంధించి ఎవరూ ఆందోళన చెంద్దవద్దన్నారు. రాష్ట్రంలో 6.65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. అతి త్వరలో 2.71 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు....