భారతదేశం, ఫిబ్రవరి 6 -- అమెరికా అనగానే భారతీయులకు అక్కడకు వెళ్లాలి అనే ఆశ. ఎలాగైనా డాలర్లు సంపాదించి.. స్వదేశం తిరికి రావాలని చాలా మంది కలలు కంటారు. అందుకే యూఎస్ ఎగిరిపోవాలనుకుంటారు. కొంతమంది సరైన విధానంలో వెళ్తే.. మరికొందరు మోసం చేసే ఏజెంట్లను నమ్మి వెళ్తారు. అక్కడకు వెళ్లిన తర్వాత వారి పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఎన్నెన్నో ఆశలతోటి దేశం దాటి వెళ్లి.. అడుగడుగున బాధలతో బతుకుతో పోరాడుతారు. తాజాగా అమెరికా నుంచి వచ్చిన భారతీయ వలసదారులకు చెందిన కథలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

వివిధ రాష్ట్రాలకు చెందిన 104 మంది అక్రమ వలసదారులతో అమెరికా సైనిక విమానం బుధవారం ఇక్కడ అమృత్‌సర్‌లో ల్యాండ్ అయింది. అక్రమ వలసదారులపై అణచివేతలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వెనక్కి పంపిన తొలి బ్యాచ్. హర్యానా, గుజరాత్ నుంచి 33 మంది చొప్పున, పంజాబ్ నుంచి 30 మంది, మహ...