భారతదేశం, జనవరి 7 -- టీటీడీలో జరుగుతున్న పలు ఇంజనీరింగ్ పనులు వేగంగా పూర్తి చేయాలని టీటీడీ ఛైర్మెన్ బీఆర్ నాయుడు అధికారులకు సూచించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌తో కలసి ఆయన సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఛైర్మెన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. అమరావతి వేంకటపాలెంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఎస్వీ ఆలయ విస్తరణ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా టీటీడీ కల్యాణ మండపాలపై ఒక కమిటీని ఏర్పాటు చేసి వారు ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టాలని సూచించారు. 5 వేల భజన మందిరాలను, నిర్మాణంలో ఉన్న ఆలయాలను, ఇటీవల కాలంలో అనుమతులు పొందిన ఆలయాలను సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.

ఉపమాకలోని ఎస్వీ ఆలయం, కరీంనగర్‌లోని శ్రీ పద్మావతీ ఆండాళ్ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి...