భారతదేశం, మే 19 -- మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన వివిధ దేశాల సుందరీమణులు.. ఇటీవల హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, తెలంగాణ నూతన సచివాలయాన్ని సందర్శించారు. అటు యాదగిరిగుట్ట, బుద్ధవనాన్ని కూడా సందర్శించారు. అక్కడ వారు ఫొటోలు దిగారు. ఈ ఫొటోలను షేర్ చేస్తూ.. సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ పరిపాలనను కొనియాడారు.

'కేసీఆర్ అద్భుతమైన పాలనకు సజీవ సాక్ష్యం.. భవిష్యత్ తరాలకు నిలువెత్తు నిదర్శనం.. ఎవరు అవునన్నా, కాదన్నా.. తెలంగాణ అభివృద్ది చిహ్నాలు అవి. బీఆర్ఎస్ పాలన కీర్తి కిరీటాలు. చెరిపేస్తే చెరిగేవి కావు, దాచేస్తే దాగేవి కావు' అని హరీష్ రావు ట్వీట్ చేశారు. ఇదికాస్త వైరల్ అయ్యింది.

ఈ మధ్య తెలంగాణ రాజకీయాల్లో 'కేసీఆర్ ఆనవాళ్లు' అనే మాట బాగా వినిపించింది. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డ...