భారతదేశం, ఏప్రిల్ 28 -- కేసీఆర్‌ మనసంతా విషంతో నిండిపోయిందని.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి విమర్శించారు. ఆయన ప్రసంగం మొత్తంలో కాంగ్రెస్‌ను విలన్‌లా చిత్రీకరించడం తప్ప ఇంకేమీ లేదన్నారు. మంచి సలహాలు, సూచనలు ఇస్తారేమోనని కేసీఆర్‌ ప్రసంగం విన్నామని, అందులో ఏమీ లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవాల సందర్భంగా ఎల్కతుర్తిలో కేసీఆర్‌ చేసిన ప్రసంగంపై పొంగులేటి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ తీరును తప్పుబట్టారు.

'గత సీఎం పరిపాలన వల్ల ధనిక రాష్ట్రం అప్పులపాలైంది. అప్పులున్నా.. ప్రజలకు సంక్షేమం అందిస్తున్నాం. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్‌ను విలన్‌గా చిత్రీకరిస్తున్నారా? కడుపంతా విషం నింపుకొని కేసీఆర్ మాట్లాడటం బాధ కలిగించింది. రెండుసార్లు అధికారం ఇస్తే.. ఎలా కొల్లగొట్టారో ప్రజలు గమనించారు. కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చి.. మంచి సలహాలు ఇస్తారని ...