భారతదేశం, నవంబర్ 6 -- జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా యూసుఫ్‌గూడ, మలక్‌పేటలో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలో పాల్గొన్నారు. చెక్ పోస్టు వద్ద కార్నర్ మీటింగ్‌‌లో మాట్లాడారు. నాటి పాలకులు సినీ ప్రముఖులతో సావాసం చేస్తే... నేను సినీ కార్మికుల సంక్షేమం ఆలోచిస్తున్నానని చెప్పారు. మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలను సంక్షేమ రాజ్యంతో నెరవేర్చుతున్నామన్నారు. పదేళ్లు బీజేపీ - బీఆర్ఎస్ కలిసి చేయలేని అభివృద్ధి నేడు ప్రజా పాలనతో సాధ్యం చేస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ మాదిరిగానే జూబ్లీహిల్స్‌ను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు..

'మైనారిటీల పక్షపాతి కాంగ్రెస్ అన్న సత్యాన్ని గుర్తు చేశాను. ఈ దేశంలో లౌకిక, ప్రజాస్వామ్య వాతావరణాన్ని ప్రతిష్ఠించి, దానిని శాశ్వతంగా నిలబెట్టింది కాంగ్రెస్. రాహుల్ గాంధీ, నేనూ ఒక వైపు... మోదీ, కేసీఆర్ ఒక వైపు ఉన్...