భారతదేశం, డిసెంబర్ 19 -- సగటు మధ్యతరగతి భారతీయుడికి సొంత ఇల్లు ఒక కల. ఆ కల సాకారం కోసం తీసుకునే 'హోమ్ లోన్' దశాబ్దాల పాటు సాగే సుదీర్ఘ ప్రయాణం. ఈ ప్రయాణంలో వడ్డీ రేట్లు కొంచెం తగ్గినా మనకు ఏదో తెలియని ఉపశమనం కలుగుతుంది. అయితే, రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను 0.25% తగ్గించినప్పుడు చాలామంది అది చాలా చిన్న మార్పు అని అనుకుంటారు. కానీ, ఆ చిన్న మార్పునే మీ సంపదను పెంచుకునే ఆయుధంగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం.

వడ్డీ రేట్లు తగ్గినప్పుడు బ్యాంకులు మన ముందు రెండు ఆప్షన్లు ఉంచుతాయి. ఒకటి.. నెలకు కట్టే EMI ని తగ్గించుకోవడం, రెండు.. EMI అలాగే ఉంచి లోన్ తీరిపోయే కాలాన్ని తగ్గించడం. లెక్కల ప్రకారం చూస్తే, EMI ని అలాగే ఉంచి లోన్ కాలపరిమితిని తగ్గించుకోవడమే అత్యంత తెలివైన పని.

ఒక ఉదాహరణతో చూద్దాం: Rs.50 లక్షల లోన్, 9% వడ్డీ రేటుతో 20 ఏళ్ల కాలపరిమితి...