భారతదేశం, ఏప్రిల్ 20 -- మీరు తక్కువ ధరలో అత్యుత్తమ ఫీచర్లతో కూడిన టీవీ కోసం చూస్తున్నట్లయితే మీ కోసం చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో జాబితా చేసిన మూడు చౌకైన స్మార్ట్ టీవీల గురించి చూద్దాం. ఈ టీవీల ధర కేవలం రూ.7999 మాత్రమే. ఈ టీవీల్లో హెచ్‌డీ రెడీ డిస్‌ప్లే ఉంటుంది. వాటిలో అద్భుతమైన సౌండ్ కూడా వస్తుంది. ఈ లిస్ట్‌లో డాల్బీ ఆడియోకు సపోర్ట్ చేసే టీవీ కూడా ఉంది.

టీసీఎల్ ఎస్44.. 79.97 సెంటీమీటర్ల (32 అంగుళాల) హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ (ఐఎఫ్ఎఫ్32ఎస్44). ఫ్లిప్‌కార్ట్‌‌లో రూ.7,999 ధరకు లభిస్తుంది. 1366x768 పిక్సెల్ రిజల్యూషన్‌తో 32 అంగుళాల హెచ్‌డీ రెడీ డిస్‌ప్లేను ఈ టీవీ అందిస్తోంది. ఈ టీవీ డిస్‌ప్లే హెచ్డీఆర్10 సపోర్ట్‌తో వస్తుంది. ఇందులో మీకు 16 వాట్ల సౌండ్ అవుట్ పుట్ లభిస్తుంది. ఈ టీవీలో డాల్బీ ఆడియో ఉంటుంద...